94 మంది లబ్ధిదారులకు రూ.64.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

చీరాల, సెప్టెంబర్ 30: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.64,40,521 విలువైన చెక్కులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అందజేశారు. వైద్య చికిత్స కోసం వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు వైద్య ఖర్చులకు సంబంధించిన నగదు...