దుండిగల్‌లో దారుణం..! యువకుడిపై హెల్మెట్‌తో దాడి..!
-ఆర్కే ఎంటర్‌ప్రైజెస్ ఇన్‌ఛార్జ్ యువరాజుపై విచక్షణారహితంగా దాడి.. -టూవీలర్‌పై వచ్చి వెంబడించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. -హెల్మెట్‌తో దాడి.. తలకు తీవ్ర గాయాలు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స.. -సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం దుండిగల్ పోలీసుల గాలింపు.. దుండిగల్, పెన్ పవర్, సెప్టెంబర్ 6: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 ఏళ్ల యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి ఘటనపై స్థానికంగా కలకలం రేపుతోంది.. సారేగూడెం సమీపంలోని ఆల్కలి మెటల్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.. వివరాల్లోకి వెళ్ళితే.. ఆర్కే ఎంటర్‌ప్రైజెస్ ఓ ప్రైవేటు సంస్థలో ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న యువరాజు (24) మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో గండి మైసమ్మ సిగ్నల్ దాటి ఆల్కలి మెటల్స్ సమీపంలో వెళ్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అతడిని వెంబడించినట్లు సమాచారం.. అనంతరం యువరాజుపై హెల్మెట్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం, సూరారంలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్‌కు తరలించారు.. ప్రస్తుతం యువరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.. బాధితుడి ఫిర్యాదు మేరకు, దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు.దాడికి పాల్పడి పరారైన గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు పోలీసులదర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది...