ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా పాత గంగవరంలో కార్డన్ అండ్ సెర్చ్
100 ఇళ్లలో తనిఖీలు.. 200 మంది వివరాల పరిశీలన.. ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్ గంగవరం, సెప్టెంబర్ 5 (పెన్ పవర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం **“ఆపరేషన్ వజ్రప్రహార్”**లో భాగంగా పోలవరం జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గంగవరం గ్రామంలో శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సందర్భంగా పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 100 ఇళ్లను తనిఖీ చేసి, సుమారు 200 మంది వ్యక్తుల వివరాలను...