గుణాత్మక విద్యాబోధనలో రాజీపడొద్దు
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆకస్మిక తనిఖీ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 28: విద్యార్థులకు అందించే విద్యాబోధనలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే పాఠశాల విద్యపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు. రంపచోడవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సోమవారం...