వైద్య ఆరోగ్య ఉద్యోగులారా ఏకం కండి
సెప్టెంబర్ 13న రంపచోడవరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలి గంగవరం, పెన్ పవర్ సెప్టెంబర్ 4: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ పోలవరం జిల్లా ముఖ్య సలహాదారు బి. యోహాన్ పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ మహాసభను జయప్రదం చేసేందుకు స్థానిక పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో...