మెగా డీఎస్సీపై రాజకీయ మంటలు.. లోకేశ్‌పై వైసీపీ గురి?
స్పోర్ట్స్ కోటా నుంచి టెట్ వరకు ఆరోపణలు.. కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ వివాదం సవాల్ మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియను దాటి రాజకీయ పోరుగా మారాయి. లోకేశ్ రాజీనామా, సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ఎంపికలు జరిగాయని స్పష్టం చేస్తోంది. రాజమండ్రి, పెన్ పవర్ సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 ఇప్పుడు ఉద్యోగ నియామక ప్రక్రియ కంటే ఎక్కువగా రాజకీయ చర్చకు...