వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, పెన్ పవర్, స్టాఫ్ రిపోర్టర్, సెప్టెంబర్ 13: తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖ సూచనలు, భద్రతా నిబంధనలు...