అంగరంగ వైభవంగా గణనాథుల శోభాయాత్ర

  కోలాటాలు, నృత్యాలతో సందడిగా గణపతి నిమజ్జన వేడుకలు గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 20: గణపతి నవరాత్రుల సందర్భంగా గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల శోభాయాత్రలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథులను గ్రామాల్లో ఊరేగించి నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కొత్తాడ గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు గణనాథుడిని సూరంపాలెం రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు....