అంగన్వాడీ ఉత్సవంలో ఎమ్మెల్యే మాలకొండయ్య

చీరాల, అక్టోబరు 5 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈపురుపాలెం గ్రామంలో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను సత్కరించి...