అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు *ఆటపాటలు, కోలాటాలతో సందడిగా సాగిన వేడుకలు* ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 15 : ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ఆర్ఎస్ నగర్ కాలనీలో బుధవారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కాలనీలోని ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలు, కోలాటాలతో కాలనీ అంతా...