ఇంటింటా ఆత్మీయ పలకరింపులు.. పూజారి లీలాప్రసాద్ విస్తృత ప్రచారం!
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 30:జీకే వీధి–1 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పూజారి లీలాప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం జీకే వీధి ప్రధాన వాణిజ్య కేంద్రం, పూజారిపాకలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికుడిగా ప్రజలకు పరిచయం ఉండటంతో గ్రామస్తులతో సన్నిహితంగా మెలుగుతూ ప్రచారం కొనసాగించారు.అనంతరం రాత్రి డి. కొత్తూరు, పి. కొత్తూరు, పామురాయి, సంపంగిగొంది గ్రామాల్లోనూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైసీపీ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు...