ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం

వేటపాలెం, అక్టోబర్ 5: 2026 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) వేటపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. గత నెల 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఎన్. సూర్యనారాయణ, డి. హేమంత్ కుమార్, ఎన్. శ్రీనివాసరావు, ఎస్. లలితా పరమేశ్వరి, ఎస్. నాగరాణి, డి. బేబీ కరుణశ్రీలను యూటీఎఫ్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు....