ఎంపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి

బాపట్ల, అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపట్ల ఎంపీ కార్యాలయంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పటాన్ రాజేష్, నర్రా ఏడుకొండలు, భోగిరి రామారావు, భోగిరి పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.