గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

వేటపాలెం, అక్టోబర్ 2 : పందిళ్ళపల్లి కి చెందిన శాంతినికేతన్ మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి సుశీల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నీలకంఠపురంలోని వృద్ధాశ్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వృద్ధులకు బన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవి, ప్రత్తి వెంకట సుబ్బారావు, నున్నా శివప్రసాద్, పేరిశెట్ల పద్మజ, డా. సత్రం మల్లేశ్వరరావు, గుత్తి విశ్వేశ్వరరావు, సజ్జా జోగేశ్వరరావు...