గూడెంకొత్తవీధిలో తుపాను ప్రభావం.. చిరుజల్లులు, ఈదురుగాలులు
గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 27:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో వాతావరణం మారింది. మంగళవారం ఉదయం నుంచి చల్లటి ఈదురుగాలులు వీస్తుండగా, పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతంలో చలి వాతావరణం నెలకొంది.తుపాను తీరం దాటే అవకాశం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఘాట్ రోడ్లపై ప్రయాణించేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రజలు...