ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
చింతూరు పెన్ పవర్, అక్టోబర్ 3: మారేడుమల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శనివారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరానికి చెందిన రామా ట్రావెల్స్ బస్సులో రాజమండ్రికి చెందిన 42 మంది ప్రయాణికులు చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి రక్షణ గోడ ను ఢీకొని అక్కడే ఆగిపోయింది. బస్సు రక్షణ గోడను ఢీకొని ఆగిపోవడంతో లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ...