చింతపల్లి ఏకలవ్య పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నిక నవంబర్ 15కు వాయిదా

చింతపల్లి, పెన్ పవర్, అక్టోబర్26: చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించాల్సిన పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికను నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, తక్కువ సమయంలో సమాచారం అందడంతో కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.నవంబర్ 15న నిర్వహించనున్న ఎస్‌ఎంసీ ఎన్నికకు తల్లిదండ్రులు గమనించి హాజరుకావాలని ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ కోరారు....