చింతూరులోనే ఆటోల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి

చింతూరు, పెన్ పవర్ అక్టోబర్ 6: చింతూరు ఏజెన్సీలోని ఆటోలు, ఇతర వాహనాల ఫిట్‌నెస్ (బ్రేక్) పరీక్షలను చింతూరులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. నాలుగు మండలాల ఏజెన్సీ ప్రాంతానికి చింతూరు కేంద్రంగా ఉన్నప్పటికీ, గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా నిర్వహించే బ్రేక్ పరీక్షల కోసం వాహనాలను రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ఏజెన్సీ ప్రాంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 100 వాహనాలు పరీక్షలకు వెళ్తే సుమారు 90...