చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

తనుమళ్లలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం.. కార్యకర్తలు, ఆయాలకు ఘన సత్కారం 25 ఏళ్ల సేవలకు గుర్తింపుగా చీరలు, జ్ఞాపికలు పంపిణీ.. ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అంగన్వాడీ సిబ్బంది సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: వాసంశెట్టి సత్యం కాజులూరు, పెన్ పవర్, అక్టోబర్ 10: చిన్నారుల సంరక్షణే ధ్యేయంగా.. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తూ.. ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. పోషకాహారం అందిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు....