జాతిపితకు ఘన నివాళి

వేటపాలెం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. సంఘ అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గాంధీజీ పాటించిన అహింసా సిద్ధాంతాన్ని యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఆచరించి దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేటపాలెం గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు నున్న శివప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు శ్రీనివాసరావు, మురళీకృష్ణ, రామకృష్ణ, సుధాకర్‌రెడ్డి, శ్యామ్, సీతారావమ్మ, రాఘవరెడ్డి, జ్యోతి, గుల్జారా, రంగనాథ్ గుప్తా, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.