జీకేవీధిలో వైసీపీ జడ్పిటిసి రెబల్‌గా కుందరి రామకృష్ణ?

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 23:గూడెంకొత్తవీధి మండల వైసీపీ జడ్పీటీసీ టికెట్ తనకు కేటాయించకపోతే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని దామనపల్లి మాజీ సర్పంచ్ కుందరి రామకృష్ణ తెలిపారు. పార్టీ బలోపేతానికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సేవలందించానని, రెండుసార్లు సర్పంచ్‌గా విజయం సాధించానని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ విషయంలో అన్యాయం చేయవద్దని కోరారు.