జీకేవీధి జడ్పీటీసీ బరిలో జనసేన, బీజేపీ అభ్యర్థులు!
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 28: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా జీకేవీధి జడ్పీటీసీ స్థానానికి జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పాంగి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా రొబ్బి పుష్పలక్ష్మి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇద్దరు అభ్యర్థులకు ఆయా పార్టీల నుంచి బీ-ఫారాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో జీకేవీధి జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.