జీకేవీధి జడ్పీటీసీ స్థానం జనసేనకు కేటాయింపు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 22:కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జీకేవీధి జడ్పీటీసీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు నాయకులు బుధవారం వెల్లడించారు. జనసేన అభ్యర్థిగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్, పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త గొర్లె వీర వెంకట్ పేరును ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.గొర్లె వీర వెంకట్ నామినేషన్ వేయనున్నారు.