జీకే వీధి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా కంకిపాటి గిరిప్రసాద్కు బీ-ఫామ్
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 26:జీకే వీధి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కంకిపాటి గిరిప్రసాద్ అధికారికంగా పార్టీ బీ-ఫామ్ అందుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు పార్లమెంట్ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, పాడేరు అసెంబ్లీ పరిశీలకుడు ఏరువాక సత్యారావు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ తదితరుల చేతుల మీదుగా బీ-ఫామ్ అందజేశారు.