జీకే వీధి–3 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బొబ్బిలి లక్ష్మణ్‌కు బీ-ఫారం
గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 26:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జీకే వీధి–3 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి లక్ష్మణ్‌కు పార్టీ బీ-ఫారం అందజేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బొబ్బిలి లక్ష్మణ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జీకే వీధి–3 ప్రజలందరూ తనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.