నర్సీపట్నంలో వైభవంగా ‘వరుణయాగం’

పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు దంపతులు భూగర్భ జలాల పెంపే లక్ష్యం నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలోని శ్రీదుర్గా మల్లేశ్వరి ఆలయంలో మంగళవారం 'వరుణయాగం' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు వారి తనయుడు, టిడిపి నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు...