నర్సీపట్నం శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
- కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు - రోజుకు 4000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఉదయం 8:55 నిమిషాలకు కలశ స్థాపనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ బుధవారం వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సతీమణి పద్మావతితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్...