నాలుగు వారాల్లో చర్యల నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

ఎంవీఎస్‌ఆర్ కళాశాల ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 30: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఘటనపై అవసరమైన చర్యలు తీసుకొని నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీస్ కమిషనర్‌, మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. కేసు నంబర్ 1051/36/9/2026కు సంబంధించి సభావట్ కళ్యాణ్, కరుపోతుల రేవంత్ సమర్పించిన ఫిర్యాదుపై అక్టోబర్ 28న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ ఆదేశాలు జారీ చేసింది....