పాడేరు జనసేన సమన్వయకర్తలుగా త్రీమెన్ కమిటీ నియామకం
పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 10: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్తలుగా త్రీమెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు గొర్లే వీరవెంకట్, కిట్లంకి పద్మ, సిదరి రామ్మూర్తిలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. కమిటీ సభ్యులకు జనసేన నాయకులు, జనసైనికులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.