పెదవలస ఎంపీటీసీ అభ్యర్థిగా లమ్మసింగి సింహాచలం కుమారికి పార్టీ బీ-ఫారం అందజేత
గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 27:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదవలస ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లమ్మసింగి సింహాచలం కుమారికి పార్టీ అధికారిక అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించే బీ-ఫారాన్ని మండల జడ్పీటీసీ అభ్యర్థి కంకిపాటి గిరి ప్రసాద్ అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ పెద్దలు, వంతల చంటిబాబు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.