బలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల కసరత్తు
టిడిపి చైర్మన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి? వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతకాయల అనిత? వీరి పేర్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది... నర్సీపట్నం, పెన్ పవర్ : ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 28న పోలింగ్ జరగగా, 30న ఫలితాలు ఇచ్చేలా షెడ్యూల్ ప్రకటించింది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే 28 వార్డులలోను రెండు పార్టీలకు నాయకత్వం ఉండగా, కొత్తగా పెరిగిన...