మోగిన నగారా.. ఖరారైన రిజర్వేషన్లు.. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం!

కాజులూరు జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు.. ఎంపీపీ పీఠం బీసీ జనరల్‌కు కేటాయింపు 20 ఎంపీటీసీ స్థానాల్లో 4 ఎస్సీ, 6 బీసీ, 10 అన్‌రిజర్వుడ్‌ స్థానాలు టికెట్ల కోసం కూటమి, వైసీపీలో ఆశావహుల ప్రయత్నాలు సాయంత్రానికి అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం కాజులూరు, పెన్‌పవర్‌, అక్టోబర్‌ 15: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో కాజులూరు మండలంలో రాజకీయ సందడి మొదలైంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇంతకాలం అభ్యర్థిత్వాలపై సాగిన ఊహాగానాలకు తెరపడింది. రిజర్వేషన్ల...