యాతపేట, పెదబొడ్డేపల్లిలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

నర్సీపట్నం, పెన్ పవర్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ మద్యం, నాటుసారా రవాణా నియంత్రణ లక్ష్యంగా నర్సీపట్నంలోని యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ ఎస్. గఫూర్, ఎస్‌ఐలు ఉమా మహేశ్వరరావు, రమేష్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ కిరణ్‌తో పాటు సుమారు 50 మంది పోలీసు...