రింతాడ–2 జనసేనకు కేటాయింపు? గబుళంగి గణేష్‌కు బీఫామ్‌..?

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 25: గూడెంకొత్తవీధి మండలం రింతాడ–2 ఎంపీటీసీ స్థానాన్ని కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన గబుళంగి గణేష్ పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు జనసేన పార్టీ తరఫున బీఫామ్ అందనున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.అయితే, కూటమి తరఫున అధికారికంగా ఎవరికి బీఫామ్ అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగనుంది....