వంచుల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా దారకని సత్యబాబు నామినేషన్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 22: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా దారకని సత్యబాబు (మోహన్) నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనపల రాజేష్, లోంజా గణపతి, చల్లంగి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.