వరి పంటలకు సాగునీటిని అందించాలి
గార్ల, పెన్ పవర్ ,అక్టోబర్: 9 గార్ల పెద్ద చెరువు పరిధిలో వరి పంటలు వేసుకున్న రైతాoగానికి సాగునీటిని విడుదల చేయాలని అఖిలపక్షం నాయకులు కందునూరి శ్రీనివాస్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కట్టెబోయిన.శ్రీనివాస్ గుగులోత్ సక్రు లు అధికారులను కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షo, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నెహ్రు సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్,ఎంపీడీవో, విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షపాతం...