విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి – చీరాల శక్తి టీమ్

చీరాల, అక్టోబర్ 5: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చీరాల సబ్‌డివిజన్ శక్తి టీమ్ పోలీసులు సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో, చీరాల 1 టౌన్ సీఐ సోమశేఖర్ పర్యవేక్షణలో సాల్మన్ సెంటర్ సమీపంలోని ఎన్‌పీఆర్ విద్యా హైస్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ కానిస్టేబుల్ కె. సుబ్బారావు బాల్యవివాహాల అనర్థాలు, పోక్సో...