సీఎంను కలిసిన పిల్లి దంపతులు.. నియోజకవర్గ సమస్యలపై వినతి
కాకినాడ రూరల్, పెన్ పవర్ అక్టోబర్ 6: కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి,పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. మంగళవారం విజయవాడ సచివాలయంలో సీఎంను కలిసి నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను సీఎంకు అందజేసి, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికసాయం...