సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

బాపట్ల, అక్టోబరు 5 : బాపట్ల మండలం జమ్ముపాలెం గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.