చీరాల మున్సిపాలిటీలో తొలిరోజే ‘0’ నామినేషన్‌!

మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్క నామినేషన్ కూడా చేయని అభ్యర్థులు.. స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చీరాల, అక్టోబర్‌ 16 : బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే ఆసక్తికర పరిణామానికి వేదికైంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులో తొలిరోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు...