30 కేజీల గంజాయి స్వాధీనం…
అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు అరెస్ట్.. వాహనాలు, మొబైల్ ఫోన్లు సీజ్... అడ్డతీగల, పెన్ పవర్, అక్టోబర్ 02; అడ్డతీగల మండలం వేటమామిడి శివారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. సీఐ ఎం. గజేంద్ర కుమార్, ఈగల్ టీమ్ పర్యవేక్షణలో ఎస్‌ఐ బి. వినోద్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు....