రైతులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన

వేటపాలెం, అక్టోబర్ 14 : వేటపాలెం మండలం అక్కయ్యపాలెం రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి  ఎం. సరిత పాల్గొని రైతులకు ఆర్టీఐ చట్టం ఉపయోగాలు, దాని ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని ఏ విధంగా పొందవచ్చనే అంశాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, తమకు అవసరమైన అధికారిక సమాచారాన్ని తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ఎంతగానో...