స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 ప్రదానం గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 ప్రధానోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి గొర్లె భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. చెత్తను...