వాసవి దేవాలయంలో దసరా ఉత్సవాలు
కారంచేడు, అక్టోబర్ 16 : బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రులలో భాగంగా సరస్వతి అలంకరణ, మహిళలకు కుంకుమ పూజ నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆలయ అర్చకులు ఏవీఎస్ సుబ్రమణ్య శాస్త్రి, శివరామకృష్ణమూర్తి అమ్మవారి విశిష్టతను వివరించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.