కాకినాడలో ఎలక్ట్రిక్ ఫిషింగ్ బోట్: డీజిల్ భారానికి హరిత ప్రత్యామ్నాయం!
డీజిల్ ఖర్చులతో సతమతమవుతున్న మత్స్యకారులకు విద్యుత్ పడవ రూపంలో కొత్త ప్రత్యామ్నాయం ముందుకొస్తోంది. కాకినాడలో ప్రయోగాత్మక ప్రారంభానికి సిద్ధమైన ఈ ప్రయత్నం భవితవ్యాన్ని సముద్రంలో పనితీరు, నిర్వహణ వ్యయం నిర్ణయించనున్నాయి. కాకినాడ, అక్టోబరు 23 (పెన్ పవర్ ప్రత్యేక కథనం): సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుడికి చేపలు ఎంతగా దొరుకుతాయన్నదే కాదు.. తిరిగొచ్చేసరికి ఇంధన ఖర్చులు పోను ఎంత మిగులుతుందన్నదీ కీలకమే. ఈ నేపథ్యంలో డీజిల్పై ఆధారాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్ చేపల వేట పడవ కాకినాడలో ప్రయోగాత్మక ప్రారంభానికి సిద్ధమైంది. మత్స్య...