ఫ్యాటీ లివర్‌పై అప్రమత్తత అవసరం

మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పెరుగుతున్న ముప్పు ఊబకాయం నియంత్రణతో అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌: వైద్య నిపుణుడు చీరాల, అక్టోబర్ 15 : మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్‌, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణుడు జగదీష్ పోలవరపు తెలిపారు. మద్యం సేవించని వారిలోనూ అధిక బరువు, మధుమేహం వంటి కారణాలతో ఫ్యాటీ లివర్‌ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. చీరాలలోని సరస్వతి గ్యాస్ట్రో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో...