గాంధీజీ ఆశయాలను ఆచరించాలి
బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా 157వ జయంతి వేడుకలు గంగవరం, పెన్ పవర్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గంగవరం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా...