మహాత్మునికి నివాళి సమష్టి బాధ్యత

గాంధీజీ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించడం యావత్తు జాతి బాధ్యత అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం గడువోకుర్తి పంచాయతీ చీడిపాలెంలో శుక్రవారం గాంధీజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం, సేవాభావం వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ...