కారంచేడులో హోమియో వైద్య శిబిరం

కారంచేడు అక్టోబర్ 12: కారంచేడు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వద్ద సోమవారం హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ శిబిరంలో ప్రజలకు హోమియో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ శిబిరంలో ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్,స్వర్ణ హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ ఎండీ (హోమియో) పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.