అభ్యసన వైకల్యాన్ని అధిగమించాలి

కారంచేడు, అక్టోబర్ 8: విద్యార్థుల్లో అభ్యసన వైకల్యాన్ని అధిగమించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక బోధన చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు బి. బాల ప్రసాద్, ఉమామహేశ్వరరావు సూచించారు. గురువారం కుంకలమర్రు, కొడవలి వారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్‌లెక్సియా లక్షణాలు, వాటిని అధిగమించే విధానాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.